ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు 7 రోజుల రిమాండ్

ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు 7 రోజుల రిమాండ్

murderers

ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు నలుగురికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వాళ్లని జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో నిందితుల్ని కోర్టుకు తీసుకెళ్లే సాహసం చేయలేదు పోలీసులు. బయటకు తీసుకొస్తే మూకదాడి జరిగే అవకాశం ఉండడంతో.. అప్రమత్తంగా వ్యవహరించారు. షాద్‌నగర్‌ మేజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ ముందు నిందితుల్ని ప్రవేశపెట్టారు.

స్టేషన్ వద్దకు భారీగా జనం తరలిరావడం.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో..తహసీల్దార్‌ పాండునాయకే స్టేషన్‌కు వచ్చారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుల్ని జైలుకు తీసుకెళ్లేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story