మహిళలను వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని చితకబాదిన గ్రామస్తులు

మహిళలను వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని చితకబాదిన గ్రామస్తులు
X

ctr

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళలను వేధిస్తున్నాడంటూ యువకుడిని చితకబాదారు గ్రామస్తులు. ఆ పోకిరికి గట్టి బుద్ది చెప్పారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే యువకుడిని తమ ముందే శిక్షించాలంటూ పోలీస్‌ జీప్‌ ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జీప్‌ వెళ్లకుండా చుట్టుముట్టారు. పోలీసులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Tags

Next Story