ప్రియాంక హత్య కేసు.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

ప్రియాంక హత్య కేసు.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

ktr

ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. అత్యాచారానికి పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేయాలంటూ ప్రధాని మోదీకి ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. పీనల్ కోడ్ ను మార్పు చేస్తూ పార్లమెంట్ లో చట్టం చేయాలంటూ కోరారు. ఇకపై అత్యాచారం చేయాలంటేనే భయపడేలా కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. నిర్భయ ఘటన జరిగి ఐదేళ్లవుతున్నా శిక్షలు పడలేదంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రేపిస్టులకు అప్పీల్‌కు అవకాశం లేకుండా ఉరి శిక్ష విధించాలన్నారు కేటీఆర్.

Tags

Read MoreRead Less
Next Story