ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారయత్నం

ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారయత్నం

crime

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. ఈ ఘటన వేములవాడ మండలం రుద్రవరంలో జరిగింది. మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన ధనుష్‌ అనే యువకుడు అత్యాచారయత్నం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక కేకలు వేయడంతో తాము అప్రమత్తమయ్యామని వెల్లడించారు.

ధనుష్‌ని పట్టుకొని బాలిక తల్లిదండ్రులు, స్థానికులు నిలదీయగా నిజం ఒప్పుకున్నాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వేములవాడ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Tags

Read MoreRead Less
Next Story