ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత

ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత

priyankareddy

మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో స్థానికులు, ప్రజలు, వివిధ సంఘాలు చేరుకున్నారు. అటు ప్రియాంక తల్లిదండ్రులు తమ ఇంటికి ఎవరూ రావొద్దు అంటూ గేటుకు తాళం కూడా వేశారు. అయినా అంతా బయటే బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీ రేవంత్ రెడ్డి.. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు.

లోపలకు వెళ్లకుండా తనను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు రేవంత్ రెడ్డి. కాసేపు వాగ్వాదం తరువాత రేవంత్ రెడ్డిని మాత్రమే ఇంటిలోపలకు పంపారు పోలీసులు. ఈ సందర్భంగా మీడియాను సైతం లాఠీలతో వెనక్కు నెట్టారు పోలీసులు. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story