ప్రియాంక రెడ్డి హత్య కేసు.. అతి కష్టం మీద నిందితులను చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు

ప్రియాంక రెడ్డి హత్య కేసు.. అతి కష్టం మీద నిందితులను చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు

priyankareddy

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రియాంక రెడ్డి హత్యను నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. వివిధ రంగాల ప్రముఖులు ఈ దారుణాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రియాంక రెడ్డిపై ఘాతుకానికి పాల్పడ్డ ఉన్మాదులను చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితులకు మేజిస్ట్రేట్‌ 7 రోజులు రిమాండ్‌ విధించగా.. నిన్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను తరలించారు. షాద్‌నగర్‌ పీఎస్‌కు వేలాది మంది జనం తరలిరావడంతో.. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. పీఎస్‌ ముందు ఆందోళనలతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షాద్‌నగర్‌లో హైటెన్షన్‌ నెలకొంది. చివరకు లాఠీ ఛార్జీచేసి.. ఎలాగొలా ఆందోళనకారుల కళ్లుగప్పి.. అతి కష్టం మీద నిందితులను చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు.

మరోవైపు ప్రియాంక కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఏకంగా ప్రియాంక తండ్రే పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఎస్పీ సజ్జనార్‌ ఈ విషయాన్ని సీరియస్‌ తీసుకున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు పోలీసులపై వేటు వేశారు. శంషాబాద్‌ ఎస్సై రవికుమార్‌, హెడ్‌కానిస్టేబుళ్లు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌ను సీపీ సస్పెండ్‌ చేశారు.

మరోవైపు ప్రియాంక కేసు రిమాండ్‌ రిపోర్టులో గుండె చెరువయ్యే విషయాలు వెలుగుచూశాయి. ముందుగా స్కూటర్‌ టైర్ పంక్చర్ వేయించుకొస్తానని చెప్పిన ఏ-1 నిందితుడు మహ్మద్ అరీఫ్.. ప్రియాంకా సెల్‌ఫోన్‌ నెంబర్‌ను తీసుకున్నాడు. ఈ క్రమంలో మహ్మద్ ఆరీఫ్ ఎంతకూ రాకపోవడంతో అతనికి ప్రియాంకా ఫోన్ చేసింది. ఈ ఫోన్ కాల్ ఆధారంగానే పోలీసులు మహ్మద్‌ అడ్రస్‌ను ట్రేస్ చేశారు.

ప్రియాంకపై బలత్కారానికి పాల్పడే క్రమంలో నిందితులు క్రూరంగా ప్రవర్తించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆమె హెల్ప్‌ హెల్ప్‌ అని వేడుకున్నా నిందితులు కనికరించలేదు. అంతేకాకుండా ప్రియాంకతో బలవంతంగా మద్యం తాగించారు. ఆపై ఒకరి తరువాత ఒకరుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అరుస్తుండటంతో గట్టిగా ముక్కు, నోరు మూశారు. దీంతో ఊపిరాడక బాధితురాలు అపస్మారస్థితిలోకి వెళ్లింది. అలా రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 20 నిమిషాల వరకు కిరాతకులు ప్రియాంకపై అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మృతదేహాన్ని లారీ క్యాబిన్‌లోకి దుండగులు ఎక్కించారు. క్యాబిన్‌లోనూ మృతదేహంపై కీచకులు ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. షాద్‌నగర్‌ బ్రిడ్జి దగ్గర కిందకి దించే సమయంలో బతికి ఉందన్న అనుమానంతో వైద్యురాలిని దుండగులు కాల్చిచంపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story