ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన మరిచిపోకముందే హైదరాబాద్‌లో మరో దారుణం

ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన మరిచిపోకముందే హైదరాబాద్‌లో మరో దారుణం

DOUTHER-RAPED

నిర్భయ వంటి కఠిన చట్టాలున్నా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. శంషాబాద్‌లో ప్రియాంకరెడ్డి హత్యాచారం ఘటన మరిచిపోకముందే.. నిందితుల్ని చంపేయాలనే డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలోనే.. మరికొన్ని మగ మృగాళ్లు రెచ్చిపోతున్నాయి. హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న టెక్కీపై జయచంద్‌ అనే దుర్మార్గుడు అత్యాచార యత్నం చేశాడు.

బాధితురాలి అక్కను రెండో వివాహం చేసుకుంటానని ఓ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయం అయ్యాడు జయచంద్. ఆమెను రెండు లక్షల రూపాయలు అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో కోపంతో రగిలిపోయాడు. ఆగ్రహావేశాలతో ఇంటికెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఆమె చెల్లెలు ఒక్కటే కనిపించింది. దీంతో.. ఆమెను టార్గెట్‌ చేసుకున్నాడు జయచంద్‌. గోల్డ్‌ చైన్, ఐఫోన్‌ ఎత్తుకెళ్లాడు. ఆమె ఫ్లాట్‌కు బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయాడు.

బాధితురాలి కుటుంబసభ్యులు ఇంటికి వచ్చే సరికి ఫ్లాట్‌ బయట లాక్‌ చేసి ఉంది. లోపల లైట్లు వెలుగుతున్నాయి. దీంతో.. వాళ్లు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. బాచుపల్లి పోలీసులు వచ్చి చూడగా.. బాధితురాలు స్పృహ కోల్పోయి కనిపించింది. ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ మృగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story