హైదరాబాద్‌లో ఒంటరిగా వున్న యువతిపై ఓ దుర్మార్గుడు అత్యాచారయత్నం

హైదరాబాద్‌లో ఒంటరిగా వున్న యువతిపై ఓ దుర్మార్గుడు అత్యాచారయత్నం

rape-attempt

నిర్భయ వంటి కఠిన చట్టాలు ఎన్ని వున్నా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒంటరిగా కనిపించిన మహిళలపై మృగాల్లా విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్‌ నిజాంపేటలో ఇంట్లో ఒంటరిగా వున్న యువతిపై ఓ దుర్మార్గుడు అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలు స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. నిజాంపేట ఈశ్వర్‌ విల్లాస్‌రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి ప్రయత్నించాడు దుండగుడు. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడి సొత్తు దోచుకునే ప్రయత్నంలో అక్కడ ఒంటరిగా యువతి ఉండటాన్ని గమనించి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఈలోగా ఆమె బంధువులు రావడంతో దుండగుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. పెనుగులాటలో యువతి స్పృహ కోల్పోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story