గ్రామ సచివాలయాల్లోనే మహిళా సంరక్షణ కార్యదర్శులు : ఏపీ డీజీపీ

X
By - TV5 Telugu |2 Dec 2019 4:31 PM IST
గ్రామసచివాలయాల్లోనే గ్రామ, వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శులు విధులు నిర్వహిస్తారన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. మహిళలు, బాలికల సమస్యలు తీర్చే బాధ్యత మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఉంటుందన్నారు. వచ్చే 6 నెలల్లో 10 బ్యాచ్‌లుగా 11 సెంటర్లలో వారికి ట్రైనింగ్ ఇస్తామన్నారు. పోలీసులతో పాటు, ఉమెన్స్, చైల్డ్ వెల్ఫేర్ శాఖ అధికారులు ఈ శిక్షణలో పాల్గొంటారన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు గ్రామాల్లో మహిళల భద్రతను బాధ్యతగా చూడాలని డీజీపీ పిలుపు ఇచ్చారు. మహిళలు, బాలికల సమస్యలు, ఇబ్బందులు వారివల్లే తీరుతాయన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com