అప్పు తీర్చలేదని పాపని కిడ్నాప్

అప్పు తీర్చలేదని పాపని కిడ్నాప్

kidnapp

అప్పుగా ఒకరి వద్ద ఓ మహిళ డబ్బు తీసుకుంది. అయితే, తీసుకున్న డబ్బును చాలా కాలంగా తిరిగివ్వట్లేదు. దీంతో ఆమె మూడేళ్ల కూతురు ని కిడ్నాప్‌ చేశాడు అప్పు ఇచ్చిన వ్యక్తి. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని జాల్నా నుంచి వచ్చి ఆర్మూర్ లో నివాసముంటున్న రహీం అనే వ్యక్తికి పెర్కిట్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఆమె తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో పెర్కిట్‌లోని మదర్సా వద్ద కాపుకాసి బాలిక బయటకు రాగానే ఎత్తుకెళ్లాడు. దీంతో ఆర్మూర్‌ పోలీసులకు ఆ బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. అప్పటికే నిందితుడు పాపను మహారాష్ట్రలోని జాల్నాలో ఉన్న తన సొంతింటికి తీసుకెళ్లాడు. దీంతో జాల్నాకు వెళ్లి ఆర్మూర్‌ పోలీసులు అతడిని పట్టుకున్నారు. పాపను తల్లికి అప్పగించారు. 24 గంటల్లో పాపను తల్లి ఒడికి చేర్చడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది.

Tags

Read MoreRead Less
Next Story