శేఖర్ మాస్టర్‌తో రష్మీ..

శేఖర్ మాస్టర్‌తో రష్మీ..

rashmi

అదిరి పోయే స్టెప్పులతో శేఖర్ మాస్టర్.. అందాల విందును పంచే రష్మీ గౌతమ్.. బుల్లి తెరపై సందడి చేసే ఈ జంటను వెండి తెరపైకి తీసుకు వచ్చే ప్రయాత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ కావాలంటూ వచ్చిన శేఖర్ మాస్టర్ స్టార్ హీరోలందరికీ పని చేశాడు. ఇప్పడు తననే ఓ హీరో చెయ్యాలని దర్శకుల ప్రయత్నాలు. అతనికి జోడీగా రష్మీ అయితే సినిమా సక్సెస్ గ్యారెంటీ అని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొరియోగ్రాఫర్లుగా ఎంట్రీ ఇచ్చి దర్శకులు, హీరోలుగా మారిన ప్రభుదేవా, లారెన్స్‌ల లిస్టులో శేఖర్ మాస్టర్‌ కూడా చేరనున్నారు ఈ సినిమా పట్టాలెక్కితే. కాగా, ఇప్పటికే వెండి తెర అనుభవం ఉన్న రష్మీ శేఖర్ మాస్టర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read MoreRead Less
Next Story