తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్‌ ఆందోళన

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్‌ ఆందోళన

telangana-congress

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆందోళన బాట పట్టింది. పీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లక్డీకాపుల్‌లోని రంగారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ దోరణి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచడంతో పాటు ఐదు రూపాయల ఉన్న కనీస టికెట్‌ ధరను పది రూపాయలకు పెంచడం దారుణమన్నారు. ఈ చార్జీల పెంపు కారణంగా ఏడాదికి వేయి కోట్ల రూపాయల భారం ప్రజల పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story