ఇక చార్జీల మోతే..

ఇక చార్జీల మోతే..
X

AIRTEL

నిన్న, మొన్నటి వరకు రేట్లు తగ్గించుకుంటూ వినియోగదారుల వెంట పడిన టెలికం కంపెనీలు ఇప్పుడు రివర్స్ ట్రెండ్ లో వరుస షాకిస్తున్నాయి. ఒకరినొకరు పోటీ పడి మరీ ఖాతాదారుల పర్స్ ఖాళీ చేస్తున్నాయి. కాల్, డేటా రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి. రిలయన్స్ జీయో ఇటీవలె కాల్ ఛార్జీలను స్వల్పంగా పెంచటంతో పాటు డేటా పరిమితి రోజులను కుదించింది. ఆ తర్వాత అదే తోవలో ఉన్న వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్.. కాల్, డేటా రేట్లును పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నెల 3 నుంచి రేట్ల పెంపును అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో మంగళవారం నుంచి 3వ తేదీ నుంచి ప్రీపెయిడ్ ప్లాన్లకు మరింత చేతి చమురు వదిలించుకోవాల్సి ఉంటుంది.

పెంచిన రేట్ల ప్రకారం వొడాఫోన్ కొత్తా ప్లాన్లను ప్రకటించింది. 2 రోజులు, 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల కాలపరిమితితో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ప్లాన్లతో పోలిస్తే ఇవి 42 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే..వోడాఫోన్, ఎయిర్ టెల్ రేట్ల పెంపు ప్రకటన చేయగానే అటు రిలయెన్స్ జియో కూడా చార్జీలు పెంచుతున్నట్లు వినయోగదారులపై బాంబు పేల్చింది. వాయిస్, డేటా చార్జీలను ఏకంగా 40 శాతం మేర పెంచుతున్నట్టు ప్రకటించి షాకిచ్చింది.

కాల్, డేటా చార్జీల పెంపుతో వాతపెట్టిన జియో కొత్త ప్లాన్లతో కొద్దిమేర ఊరటిచ్చింది. కొత్త ప్లాన్లతో 300 శాతం అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని చెబుతోంది. డిసెంబరు 6 నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులోకి వస్తాయని జియో ప్రకటించింది.

Tags

Next Story