అంతర్జాతీయం

మెక్సికోలో భారీ ఎన్ కౌంటర్

మెక్సికోలో భారీ ఎన్ కౌంటర్
X

mexico

మెక్సికోలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు, మాదకద్రవ్యాల ముఠాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది మరణించారు. వీరిలో 13మంది ముఠా సభ్యులు కాగా... ఇద్దరు సాధారణ పౌరులు, నలుగురు పోలీసులు ఉన్నారు. అమెరికా సరిహద్దుకు 40 మైళ్లదూరంలో విల్లాయూనియన్ పట్టణంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఓ భవనంలో డ్రగ్స్ స్మగ్లర్లు దాగినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికిచేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దాడి అనంతరం ముఠా సభ్యులనుంచి 14 వాహనాలతోపాటు పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్రగ్స్ స్మగ్లర్ల ఆటకట్టిస్తానని హెచ్చరించిన నేపధ్యంలో ఈ ఎన్ కౌంటర్ జరుగడం విశేషం.

Next Story

RELATED STORIES