విద్యార్థులకు ఉచితంగా ప్లిప్‌కార్ట్..

విద్యార్థులకు ఉచితంగా ప్లిప్‌కార్ట్..

flipkart

విద్యార్థులకు ప్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం విద్యార్థి దగ్గర స్టూడెంట్ ఐడీ కార్డ్ ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్‌లో ప్లిప్‌కార్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తరువాత ప్లిప్‌కార్ట్ ప్లస్ సెక్షన్‌లో మెంబర్‌షిప్ ఉచితంగా తీసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థి వ్యక్తిగత వివరాలు వెల్లడించడంతో పాటు కాలేజీ ఐడీ ఫ్రూఫ్ అప్‌లోడ్ చేయాలి. వెరిఫికేషన్ తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ప్రస్తుతం ప్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్ నడుస్తోంది. డిసెంబర్ 5 వరకు ఈ సేల్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, పేటీఎం ఫస్ట్ లాంటి లాయల్టీ ప్రోగ్రామ్ లాంటిదే ప్లిప్‌కార్ట్ ప్లస్. ఈ మెంబర్ షిప్ తీసుకున్న సభ్యులకు ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. రూ.100 కొనుగోలు చేస్తే 4 సూపర్ కాయిన్స్ లభిస్తాయి. సూపర్ కాయిన్స్ గెలుచుకోవడం, ఉచితంగా, వేగంగా ప్రొడక్ట్స్ డెలివరీ, సేల్స్ సమయంలో

ముందే యాక్సెల్ లభించడం, కాయిన్స్ ఎక్సేంజ్ చేసి రివార్డ్స్ పొందడం, ప్రత్యేకమైన కస్టమర్ సపోర్ట్ లాంటి లాభాలు ప్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఉంటాయి.

Read MoreRead Less
Next Story