వామ్మో.. ఒక్క జామకాయ రూ.100లంట..

వామ్మో.. ఒక్క జామకాయ రూ.100లంట..
X

Guva

ఏం తినేటట్టులేదు.. ఏం కొనేటట్టు లేదు. పేదవాడి యాపిల్ జామకాయ అంటారని కొందామని వెళ్తే ఒక్క జామకాయే రూ.100లు చెబుతున్నారే తల్లీ. అదేమంటే ఈ కాయలో ఎన్నో రకాల విటమిన్స్, పోషకాలు ఉన్నాయంటున్నారు. హర్యాలోని జీంద్‌లోని కందేలా గ్రామంలో ఓ రైతు పండించిన జామ ఈ ధర పలుకుతోంది. ధర విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. థాయ్‌లాండ్ రకానికి చెందిన ఈ జామను సునీల్ రెండేళ్లుగా జామ సాగు చేస్తున్నాడు.

ఒక్కో జామ కాయ బరువు సుమారు 800 గ్రాములు ఉంటుంది. మనం రోజూ తినే జామ కాయతో పోలిస్తే ఈ జామ కాయ రుచిలోనూ, పోషకాల్లోనూ అదుర్స్ అంటున్నారు. ఇంతగా చెబుతున్నారు.. మరెంతో ఊరిస్తున్నారు ఒక్క కాయన్నా కొందామని జనం పోటీ పడుతున్నారు. దీనికి తోడు ఈ చెట్లకు ఎటువంటి రసాయనిక ఎరువులు వేయకుండా సేంద్రియ ఎరువులు వేసి పండించారు. పంట వేసిన మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన దిగుబడి అందించింది రైతుకి.

Next Story