నిందితుల సండే మెనూ.. ఉదయం పులిహోర.. మధ్యాహ్నం మటన్..

నిందితుల సండే మెనూ.. ఉదయం పులిహోర.. మధ్యాహ్నం మటన్..

prisoners

తాగిన మైకమో.. ఏం చేసినా ఎవరేం చేయలేరన్న ధీమానో.. ఓ ఆడబిడ్డ జీవితాన్ని అన్యాయంగా బలి తీసుకున్నారు. మనుషులన్న సంగతే మర్చిపోయి మృగాల్లా ప్రవర్తించారు. అందులో ఒకడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని నిమ్స్ వైద్యులచే చికిత్స ఇప్పిస్తున్నారు. కనిపిస్తే కాల్చివేసేంత ఆగ్రహంతో ప్రజలు ఉన్నారని ఆ నలుగురికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వారు కూర్చున్న చోటుకే వేడి వేడి భోజనం అందిస్తున్నారు.

నిన్న సండే కావడంతో ఉదయం పులిహోర, మధ్యాహ్నం, రాత్రి మటన్‌తో భోజనం అందజేశారు. అయితే వారిలో ఏ విధమైన పశ్చాత్తాపం కానీ, ముఖంలో భావోద్వేగాలు కానీ కనిపించలేదని జైలు సిబ్బంది తెలిపారు. భోజన విరామ సయమంలో నలుగురు నిందితులను వరండాలో అటు ఇటూ తిప్పి వారి కదలికను పరిశీలించారు. మరో వైపు నిందితులకు ఉరిశిక్ష విదించాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి.

చర్లపల్లి జైలు వద్ద మహిళాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.. తోటి ఖైదీలు కూడా నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవుల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బూతులు తిడుతూ వారిపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఆ నలుగురిని ఎట్టి పరిస్థితుల్లో తోటి ఖైదీలతో కలవకుండా చర్యలు తీసుకుంటున్నారు జైలు అధికారులు. అండర్ ట్రయల్ ఖైదీలు కావడంతో వారికి జైలులో ఎలాంటి విధులు అప్పగించమని చెబుతున్నారు. ఇక వీరు ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడతారో అని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story