దిశ హత్యకేసు నిందితుల్లో కనిపించని మార్పు

దిశ హత్యకేసు నిందితుల్లో కనిపించని మార్పు

disha-victims

దిశ.. దిశ.. ఈ పేరు అందరితో కన్నీరు పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆమెకు మద్దతుగా జనం ముందుకు కదులుతున్నారు.. అతి దారుణంగా అత్యాచారం చేసి.. తరువాత హత్య చేసిన ఆ నలుగురు నిందితులను ప్రజాక్షేత్రంలో ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తున్నారు..

తన కూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వారిని షూట్‌ చేయాలని దిశ తండ్రి డిమాండ్‌ చేశారు. కూతురి అస్తికలను జోగులాంబ గద్వాల్‌ జిల్లా బీచుపల్లి కృష్ణా నదిలో కలిపిన ఆయన.. నిందితులను నడిరోడ్డుపై కాల్చి చంపినప్పుడే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందన్నారు. బీచుపల్లి కృష్ణానదిలో స్నానం చేసి.. అక్కడి కోదండరాముల వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే.. తన బిడ్డ ఆస్తికలను కలపాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.

హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో వెటర్నర్నీ డాక్టర్‌ దిశా హత్య కేసులో దోషులను బహిరంగ ప్రజా కోర్టులో శిక్షించాలని మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

దిశ దారుణ హత్యపై తెలంగాణలో నిరసనలు మిన్నంటుతున్నాయి.. నిందితులను కఠినంగా శిక్షించాలని.. అత్యాచారాలు చేయాలంటేనే భయపడేలా శిక్ష ఉండాలి అంటూ మహిళా లోకం కథం తొక్కుతోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటి దగ్గర నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భార్య పాల్గొన్నారు.. నిందితులను సత్వరమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..

దిశ కేసు మృగాళ్లకు ఓ గుణ పాఠం కావాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందనరావు అన్నారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి దిశ హంతకులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దిశ హత్యకు నిరసనగా హైదరాబాద్‌లో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే ఉరితీయాలంటూ డిమాండ్‌ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువతులు.. న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందంటూ... ఆవేదన వ్యక్తం చేశారు..

దిశ హత్య కేసులో నిందితుల్ని ఉరి తీయాలంటూ రాజేంద్రనగర్‌లో భారీ ర్యాలీ చేపట్టారు.. వెటర్నరీ కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. నలుగురు నిందితుల దిష్టిబొమ్మలను దహనం చేశారు..

దిశ హత్య కేసులో నిందితులు శిక్ష అనుభవిస్తున్న చర్లపల్లి జైలు వద్ద మహిళాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి..

చర్లపల్లి జెల్లోని మహానంది బ్యారక్‌లో దిశ హత్యకేసు నిందితులు మహ్మద్‌ ఆరీఫ్ పాషా, శివ, చెన్నకేశవులు, నవీన్‌ కుమారుల్లో ఎలాంటి మార్పులు పెద్దగా కనిపించడం లేదు. ముఖంలో భావోద్వేగాలు కానీ కనించలేదని జైలు సిబ్బంది తెలిపారు. భోజన విరామ సయమంలో నలుగురు నిందితులను వరండాలో అటు ఇటూ తిప్పి వారి కదలికను పరిశీలించారు. కాని వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కన్పించడంలేదని జైలు అధికారులు పేర్కొన్నారు. అటు నిందితులకు జైల్లోనే వైద్యపరీక్షలు నిర్వహించారు వైద్యులు.

Tags

Read MoreRead Less
Next Story