పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్ కమెడియన్..

పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్ కమెడియన్..

durga-rao.png

జబర్దస్త్‌షోలో కనిపించే కమెడియన్లంతా ఓ ఇంటి వారవుతున్నారు. కుటుంబాన్ని, కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తమకు జీతాన్ని, జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ షోని ఎప్పటికీ మర్చిపోలేమంటారు. అడపా దడపా సినిమాల్లో కూడా అవకాశాలు అందిపుచుకుంటున్నారు కొందరు. తాజాగా ఓ కమెడియన్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. స్టేజ్ ఆర్టిస్టుగా వచ్చి కెమెరామెన్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ వరకు ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ దుర్గారావు పెళ్లి పీటలెక్కనున్నాడు. మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న ఈయన మళ్లీ ఈ మధ్యే వచ్చాడు. దుర్గారావు నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read MoreRead Less
Next Story