కోతి, చిలుక మధ్య స్నేహం

కోతి, చిలుక మధ్య స్నేహం

monkey

స్నేహానికి జాతీ బేధం లేదు. దీన్ని నిజం చేస్తున్నాయి ఓ వానరం... ఓ చిలుక! జాతి వైరుద్యం మరిచి.. ఈ మూగ జీవుల మధ్య చిరుగించిన స్నేహం.. చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అదిలాబాద్‌లోని కేఆర్‌కే కాలనీలో ఆటో డ్రైవర్‌ జావీద్‌కు జంతువులు, పక్షులంటే ఎంతో ఇష్టం. ఆయన తన ఇంట్లోనే వివిధ రకాల జంతువులు, పక్షుల్ని పెంచుకుంటున్నాడు. వీటిలో కోతి, చిలుకకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

వీటి స్నేహం చూసి.. కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవి చేసే విన్యాసాలు, సందడి చూసేందుకు కాలనీవాసులు డ్రైవర్‌ జావీద్‌ ఇంటికి వచ్చి కొద్దిసేపు గడిపిపోతున్నారు. కోతి, చిలుక చేసే చిలిపి పనులను చూసి రోజంతా పడిన కష్టాలను మరిచిపోతున్నామంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story