రైతులకు గిట్టుబాటు ధరపై త్వరలో ఆందోళన చేపడతా.. - పవన్‌

రైతులకు గిట్టుబాటు ధరపై త్వరలో ఆందోళన చేపడతా.. - పవన్‌
X

pawan

భవనాలను కూల్చేందుకు ప్రభుత్వం చూపించే శ్రద్ధ సామాన్య ప్రజల కష్టాలపై పెట్టాలన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. తిరుపతిలోని రైతు బాజర్‌లో ఉల్లి రైతులు, సామాన్య ప్రజలతో నేరుగా పవన్‌ మాట్లాడారు. 100 రూపాయలకు ఉల్లి అమ్ముతుంటే ఎలా కొనగలమని సామాన్యలు పవన్‌ ముందు వాపోయారు. దళారీల కారణంగానే విపరీంతంగా ధరలు పెరిగిపోయాయని కొనుగోలుదారులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదంటూ .. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరపై త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పవన్‌ భరోసా ఇచ్చారు.

Tags

Next Story