అయ్యప్ప మాల ధరించిన స్టూడెంట్.. సస్పెండ్‌ చేసిన స్కూల్ యాజమాన్యం

అయ్యప్ప మాల ధరించిన స్టూడెంట్.. సస్పెండ్‌ చేసిన స్కూల్ యాజమాన్యం

nlg

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఇండియన్‌ మిషన్‌ స్కూల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ విద్యార్థి అయ్యప్ప స్వామి మాల ధరించి రావడంతో.. స్కూల్‌ యాజమాన్యం సీరియస్‌ అయ్యింది. అక్కడితో ఆగకుండా స్కూల్‌కు అయ్యప్ప మాల ధరించి వచ్చాడనే కోపంతో.. విద్యార్థిని 40 రోజులు సస్పెండ్‌ చేసింది స్కూల్‌ యాజమాన్యం.

అయ్యప్ప మాల వేసుకున్నాడనే కారణంతో విద్యార్థిని సస్పెండ్‌ చేయడంపై అయ్యప్ప భజన మండలి, విశ్వహిందు పరిషత్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో స్కూల్‌కు చేరుకొని యాజామాన్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మరోవైపు విద్యార్థి బంధువులు స్కూల్ అద్దాలు పగలగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఈ ఘటనపై మండల విద్యాధికారి స్పందించారు.. పూర్తి విచారణ చేపట్టి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story