గుడ్‌న్యూస్.. ఇకపై SSC,RRB,IBPS అన్నిటికీ ఒకటే పరీక్ష..

గుడ్‌న్యూస్.. ఇకపై SSC,RRB,IBPS అన్నిటికీ ఒకటే పరీక్ష..
X

students

అన్నీ రాయాలనుంది.. ఏదో ఒకటి వస్తుందని.. పైగా పేటర్న్ కూడా ఒకటే.. కానీ ఏదీ రాయాలన్నా ప్రతి దానికి ఓ దరఖాస్తు.. దానికి ఫీజు.. వస్తుందో రాదో అనే డౌట్ కంటే .. ఫీజులు కట్టలేక ఇబ్బంది పడే వారే ఎక్కువ మంది. మరి వీటన్నింటికీ చెక్ పెడుతూ ఒకే పరీక్ష పెట్టాలని యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అదే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET. అన్ని పోస్టులకు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB, ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS వంటి వాటికి ఈ ఒక్క పరీక్ష రాస్తే సరిపోతుంది. ప్రతి నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడం, ఫీజులు చెల్లించడం ఇలాంటివి ఏవీ వుండవు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారిని ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇంకా ప్రతిపాదనలో ఉన్న ఈ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఈ ప్రదిపాదన అమలులోకి రాగానే డిగ్రీ, ఇంటర్, టెన్త్ పాసైనవారికి 'సెట్' పరీక్ష నిర్వహిస్తుంది.

Next Story