లేటెస్ట్ టెక్నాలజీ.. ఫోన్ చార్జింగ్.. ఒక్క నిమిషంలోనే 80 శాతం

లేటెస్ట్ టెక్నాలజీ.. ఫోన్ చార్జింగ్.. ఒక్క నిమిషంలోనే 80 శాతం
X

phone-charging

టైమ్ లేదు.. ఫోన్‌లో చార్జింగ్ లేదు.. ఒక్క నిమిషం.. ఓన్లీ ఒన్ మినిట్ చాలంటున్నాయి స్మార్ట్ ఫోన్ కంపెనీలు.. ఆ ఒక్క నిమిషంతోనే మీ ఫోన్ 80 శాతం చార్జింగ్ అవుతుందని చెబుతున్నారు. ఎంత సేపు మాట్లాడినా ఒంట్లో ఎనర్జీ అయిపోవాలి కానీ.. ఫోన్‌లో చార్జింగ్ మాత్రం అయిపోకూడదు.. అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్‌లో అన్నీ మాట్లాడేయాలి.. మరి అలాంటి వారి కోసమే మా ఈ ప్రయత్నం అని చెబుతున్నారు చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ హువాంగ్ యున్ హుయ్ ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నారు. ఈ టెక్నాలజీని పెకింగ్ యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ అల్యూమ్నీ ఫోరంలో ప్రదర్శించారు. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ఇంకా తెలియజేయలేదు. మార్కెట్లోకి వస్తే ఇదే అత్యంత ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అవుతుందని మాత్రం అంటున్నారు.

Next Story