చట్టాలు కఠినతరం చేయాలి: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

చట్టాలు కఠినతరం చేయాలి: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

డాక్టర్ దిశ కుటుంబానికి బాసటగా నిలిచింది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. శంషాబాద్‌లోని నక్షత్ర విల్లాస్‌కు వెళ్లిన మా సభ్యులు.. దిశ కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణం నిందితులకు శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌లో కేసు విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిశలో తమకు తమ పిల్లలే కనిపిస్తున్నారని.. జరిగిన ఘోరం తలుచుకుంటేనే కన్నీరొస్తోందని అన్నారు. దిశ ఉదంతం తర్వాత కూడా ఇలాంటి అత్యాచార ఘటనలు 3 జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాలు కఠినంగా ఉంటే తప్ప ఇలాంటివి ఆగేట్టు కనిపించడం లేదని నటి హేమ అన్నారు. మిగతా మా సభ్యులు కూడా రేపిస్ట్‌లకు మరణ శిక్ష వెయ్యాల్సిందేనని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story