వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య

వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య

murder

తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన...వృద్ధురాలి హత్య, అత్యాచారం ఘటనలో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. నిందితుడు కేశనకర్తి నాగబాబుని అరెస్ట్ చేశారు .వృద్ధురాలిపై అత్యాచారం చేసి చంపేసినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. జి.వేమవరానికి చెందిన వృద్ధురాలు ఈనెల 2వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో...తలుపులు తోసుకొని లోపలికి వచ్చాడు నాగబాబు. ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత చీరను మెడచూట్టూ బిగించి చంపేశాడు.

ఇంట్లోని ట్రంక్‌పెట్టలో ఉన్న 80వేల నగదును కూడా...ఎత్తుకెళ్లాడు నాగబాబు. సాక్షాలు తారుమారు చేసేందుకు ఇంట్లో మొత్తం కారం చల్లాడని పోలీసులు తెలిపారు.. నిందితుడిపై 302తోపాటు పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. గతంలో నాగబాబు ఓ చోరీ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story