నిత్య'ఆనందం' కోసం కొత్త దేశం.. రాజ్యాంగం, జెండా.. అన్నీ..

నిత్యఆనందం కోసం కొత్త దేశం.. రాజ్యాంగం, జెండా.. అన్నీ..
X

nityananda

ఆయనో దొంగ సామి. అదే గుడి వెనక సామి బ్యాచ్. ఒంటినిండా కాషాయం చుట్టుకొని కంగాళి కేసుల్లో ఇరుక్కున సాములోరు ఆయన. అతని మీద రేప్ కేసులు, హింస కేసులు ఉన్నాయి. కేసులన్ని మెడకు చుట్టుకోవటంతో ఇక చేసేది లేక దేశం నుంచి ఉడాయించాడు. ఇక మీ దేశంతో నాకేం పని ఉందంటూ ఏకంగా ఆయనే ఓ దేశాన్ని ఏర్పాటు చేశాడు. ప్రత్యేక రాజ్యాంగం.. మంత్రులు, బ్యాంకులు అన్ని సెట్ చేశాడు. ఆయనే నిత్యానందస్వామి. కైలాస పేరుతో ఓ దేశాన్ని క్రియేట్ చేశాడతను.

స్వాములు అంటే సర్వసంగ పరిత్యాగులు. అన్ని బంధాలు ఒదిలేసి.. సుఖదుఖాలకు అతీతంగా నిత్యం దైవ స్మరణతో ఉండాలి. ఉంటారు కూడా. కానీ, మన సాములోరు అందుకు పూర్తిగా రివర్స్. అన్ని బంధాలు కలిపేసుకుంటాడు. కుదిరితే భక్తి రూపంలో.. లేదంటే బలవంతంగానైనా సరే. ఎట్ లాస్ట్.. ఎట్ ఎనీ కాస్ట్ సర్వసుఖాలు అనుభవించాలన్నదే మనోడి మోటీవ్.

ఇలా ఎడాపెడా గోకేసి పీకలమీదకు తెచ్చుకున్నాడు ఈ నిత్యానందస్వామి. అప్పుడెప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ఓ నటితో స్వామివారి చాటు సంగతులు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి మనోడికి నిత్యానందంలో ఆనందం మొహం చాటేసింది. కేసులు వెంటాడుతున్నాయి. అయినా..స్వామి అనే అహంకారం. భక్తులు ఇచ్చే విరాళాలతో ఎప్పటికప్పుడు కేసు నీడలు కబళించకుండా నెట్టుకొస్తున్నాడు. ఇక ఇటీవలె కర్నాటకలో ఓ రేప్ కేసు, గుజరాత్ లో ఓ వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసుల్లో పోలీసులు కొద్దిగా స్క్రూ టైట్ చేశారు. అంతే.. మనోడు కొన్నాళ్లు అజ్ఙాతంలోకి వెళ్లాడు. సమయం చూసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా దేశం విడిచి జంప్ అయ్యాడు.

పాస్ పోర్టు లేదు. వీసా లేదు. నేపాల్ మీదుగా పారిపోయి.. ఏకంగా ఓ దేశాన్నే స్థాపించాడు. మీకు కామెడీగానే ఉన్నా.. నిత్యానంద మాత్రం సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నాడు. ఆయన స్థాపించిన దేశం పేరు కైలాస. ఇది ఒక ద్వీప దేశం. ట్రినిడాడ్-టొబాగోల సమీపంలో ఉంటుంది. తన దేశం పేరు కైలాసతో వెబ్ సైట్ ను కూడా ప్రారంభించాడు. అంతేకాదు.. కైలాసాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి న్యాయ నిపుణుల బృందాన్ని కూడా పంపించాడు.

సెంట్రల్ లాటిన్ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఓ దీవిని కొని దానికే కైలాస అని నామకరణం చేశాడు నిత్యానంద. ఈ దేశానికి జెండా, పాస్‌పోర్ట్ లు, ఎంబ్లమ్ రెడీ అయ్యాయి. పాస్ పోర్ట్ లు ఒకటి గ్రీన్, మరొకటి రెడ్. ఇక కైలాస దేశానికి కేబినెట్ ఏర్పాటుచేసి ప్రధానమంత్రిని కూడా నియమించాడు. ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఇంగ్లీష్, సంస్కృతం, తమిళ్ అధికారిక భాషలు. అలాగే జాతీయ జెండా, జాతీయ పుష్పం, జాతీయ జంతువు ఇలా అన్ని వివరాలను తన వెబ్ సైట్లో వెల్లడించాడు నిత్యానంద.

ఇక భారత్‌తో అన్ని బంధాలు తెంచుకున్నట్లు ప్రకటించాడు. ఇండియాలో హిందువులకు అన్యాయం జరుగుతోందని.. ఎలాంటి సరిహద్దులు లేని నిఖార్సైన హిందు దేశం తమదని ప్రకటించుకున్నాడు నిత్యానంద. మర్రి చెట్టును జాతీయ చెట్టుగా ప్రకటించిన మన స్మైలీ సాములోరు అక్కడే మర్రి మానులా పాతుకుపోతారా? మన పోలీసులు సామిని ఇండియా తీసుకొస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.

Tags

Next Story