మత ప్రచార కేంద్రంగా మారిన ప్రభుత్వ కార్యాలయం

అదొక ప్రభుత్వ ఉద్యోగుల సమీక్షా సమావేశం. కానీ.. ఓ అధికారి దాన్ని మతపరమైన కార్యక్రమంగా మార్చారు. ఈ ఘటన నల్గొండ మండలం రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. DMHOలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు రాములబండ PHC ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి నెల మొదటి మంగళవారం PHC పరిధిలోని ANM, ఆశావర్కర్ల సమీక్షా సమావేశం ఉంటుంది. అందరినీ అడెంట్ కావాల్సిందిగా శ్రీనివాస్ ఆదేశించారు. తీరా అక్కడికి వెళ్లాక బైబిల్ గ్రంథం పఠనం మొదలయ్యే సరికి ఉద్యోగులంతా షాక్ అయ్యారు.
రోటా వైరస్ కో-ఆర్డినేషన్ మీటింగ్‌లో జరిగిన వ్యవహారాన్ని కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బలవంతంగా ఇలా క్రైస్తవ ప్రార్థనలు చేయించడమేంటని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇన్‌ఛార్జి శ్రీనివాస్ తన పేరును ప్రభుదాసుగా మార్చుకుని.. పాస్టర్‌గా అవతారమెత్తి.. కల్వరీ మిరాకిల్ మినిస్ట్రట్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలసత్వం వహించడంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com