అమెరికాలో భారత ఎయిర్ మార్షల్ చీఫ్‌కు తప్పిన పెను ప్రమాదం

భారత ఎయిర్ మార్షల్ చీఫ్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియాకు పెను ప్రమాదం తప్పింది. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బృందపై ఓ అగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటన నుంచి భదౌరియా టీమ్ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. హవాయిలోని పెరెల్ హార్బర్ నేవీ షిప్ యార్డ్ లో దుండుగుడు తుపాకితో దాడికి పాల్పడ్డాడు. నేవీ బేస్ లోకి చొరబడి అక్కడి సిబ్బందిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో డిఫెన్స్ కు చెందిన ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. నిందితుడు అమెరికా నేవీ లో పనిచేస్తున్న నావికుడిగా గుర్తించారు. ఇదే షిప్ యార్డ్ లోనే ఎయిర్ బేస్ కూడా ఉంది. ఇక్కడ పసిపిక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ సదస్సు జరుగుతోంది. ఇందులో భారత్ నుంచి భదౌరియా తన బృందంతో కలిసి పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com