దిశ కేసు విచారణకు 20 మందితో స్పెషల్ టీమ్

దిశ కేసు విచారణకు 20 మందితో స్పెషల్ టీమ్

disha-victims

దిశ కేసు విచారణకు 20 మందితో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌ రెడ్డి నేతృత్వంలో నలుగురు అడిషనల్ ఎస్పీలు, సీఐ, ఎస్సైలతో విచారణ బృందం గురువారం నుంచి రంగంలోకి దిగింది. అన్ని సాక్ష్యాలతో వైట్ ఫీల్డ్ ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. విచారణతో పాటు శాస్త్రీయంగా ఆధారాల సేకరించి.. నేరాన్ని పక్కాగా నిరూపించాలని భావిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదిక ఆధారంగా దర్యాప్తుపైనా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే దిశ కేసు నిందితుల్ని షాద్‌నగర్ కోర్టు వారం పాటు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో.. రహస్య ప్రాంతంలో విచారణ కొనసాగనుంది. ఛార్జ్‌షీట్‌ దాఖలైన వెంటనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ మొదలవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story