ఆ విషయంపై ఉన్న శ్రద్ధ.. రైతుల కష్టాలపై లేదాయే? : పవన్‌ కళ్యాణ్

ఆ విషయంపై ఉన్న శ్రద్ధ.. రైతుల కష్టాలపై లేదాయే? : పవన్‌ కళ్యాణ్
X

cm-jagan

ఇంగ్లీష్ మీడియంపై సీఎం జగన్‌కు ఉన్న శ్రద్ధ.. రైతుల కష్టాలపై లేదా అని జనసేన అధినేత పవన్‌ ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చి గెలిపించింది రైతులను కష్టాల్లోకి నెట్టేయడానికేనా అని నిలదీశారు.. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మార్కెట్‌ యార్డులో టామోటా రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్న ఆయన మరోసారి వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు..

రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతుల కష్టాలపై అసెంబ్లీలో చర్చించకుంటే అమరావతిలో నేరుగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాను అన్నారు. ప్రజలను సమస్యల్లోకి నెట్టి.. తమ ప్రభుత్వాన్ని తామే కూల్చుకునేలా ప్రభుత్వ పాలన సాగుతోంది అన్నారు పవన్‌.

Tags

Next Story