వావ్.. కారంటే ఇదిరా బుజ్జి.. మార్కెట్లోకి మరో కొత్త ఎంజీ..

వావ్.. కారంటే ఇదిరా బుజ్జి.. మార్కెట్లోకి మరో కొత్త ఎంజీ..
X

MG-Car

కారులో వెళ్తున్నా ఓ కొత్త మోడల్ కారు కనిపించిందంటే కళ్లన్నీ దానివైపే.. వాహన ప్రియుల కోసం ఎంజీ మోటార్స్ ఈసారి ఓ ఎలక్ట్రిక్ కారును వినియోగ దారులకు పరిచయం చేయాలనుకుంటోంది. ఎంజీ జెడ్‌ఎస్ ఈబీ పేరుతో దీనిని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. తమ కారు హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుకు బలమైన పోటీ ఇస్తుందని కంపెనీ అభిప్రాయపడుతోంది.

కారులోపల ఇంటీరియర్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫాటైన్‌మెంట్ సిస్టమ్‌కు యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సౌకర్యాలు ఉన్నాయి. యూఎస్‌బీ మొబైల్ చార్జింగ్ సౌకర్యాన్ని ముందు, వెనుక వరుసల్లో ఇచ్చారు. సన్‌రూఫ్ సిస్టమ్‌ని కూడా ఏర్పాటు చేశారు. కారులో ఐస్మార్ట్ 2.0 కనెక్టెడ్ కార్ టెక్నాలజీని అందించారు. ఈ కారుకు పీఎం 2.5 ఎయర్ పిల్లర్లను ఇచ్చారు. ఇది కారు క్యాబిన్‌లోకి వచ్చే గాలిని ఫిల్టర్ చేస్తుంది. 44.5 కిలోవాట్స్ అవర్స్ శక్తి ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు ఈ కారులో. దీంతో ఒక్క సారి రీఛార్జి చేస్తే 340 కిలోమీటర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది.

ఇందులో అమర్చిన లిథియం అయాన్ బ్యాటరీ వల్ల 40 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి 50 కిలోవాట్స్ డీసీ చార్జర్ ఉండాలి. కంపెనీ ఇచ్చే 7.4 కిలోవాట్ల హోం చార్జర్‌తో ఇంట్లో కూడా చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉంది. కారుతో పాటు 15ఏఎంపీ ప్లగ్స్‌ను కంపెనీ అందిస్తుంది. కారును విక్రయించే కేంద్రాల్లో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది ఎంజీ. రానున్న కాలంలో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.

Next Story