ఇంట్లో ఇల్లాలితో.. ఆఫీస్‌లో అమ్మాయితో..

ఇంట్లో ఇల్లాలితో.. ఆఫీస్‌లో అమ్మాయితో..

cinema

నాన్న చెప్పినట్టే చదువుకున్నాడు.. నాన్న చూపెట్టిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.. ఇష్టం లేకపోయినా కాళ్లదాకా వచ్చిన ఉద్యోగాన్ని ఎందుకురా కాదనుకుంటావు అంటే నాన్నని ఎదిరించే ధైర్యం లేక జాయినయ్యాడు.. అందమైన భార్య, మంచి ఉద్యోగం. అయినా ఏదో వెలితి.. అన్నీ నాన్న ఇష్టప్రకారమే చేశాను. నా ఇష్టా ఇష్టాలతో పని లేకుండా పోయింది అని అభినవ్ త్యాగి మధన పడుతుండేవాడు.

అంతలో ఆఫీస్‌కి వచ్చింది ఓ అందమైన అమ్మాయి. అతడిలో నిద్రాణంగా ఉన్న కోరికల్ని నిద్ర లేపింది. ఆమె చూపులు అతడి మీద ప్రసరించే సరికి మనసు మాట విననంది. అప్పటి వరకు జీవితంలో దేన్నీ ఇష్టపడి సాధించే అవకాశమే రాని త్యాగి.. తొలిసారి ఆమెను ఇష్టపడ్డాడు. మరి ఆమె కూడా అతడిని ఇష్టపడిందా లేక కుటుంబరావు అని పక్కన పెట్టిందా.. అసలింతకీ అతడు.. నువ్వంటే నాకిష్టం అని ఆమెకు చెప్పాడా లేదా.. ఇవన్నీతెలియాలంటే పతి పత్ని ఔర్ వో సినిమాకి వెళ్లి చూడాల్సిందే.

ఈ ఏడాది 'లుకా చుప్పి'తో విజయాన్ని అందుకున్న కార్తీక్ ఆర్యన్ ఇందులో హీరో. భార్య వేదికగా భూమి ఫడ్నేకర్.. మరో హీరోయిన్‌గా అనన్య పాండే నటించింది. ఓ వైపు భార్య, మరోవైపు ప్రియురాలు.. ఇద్దరి మధ్య నలిగిన త్యాగి.. ఆధ్యంతం వినోదాత్మకంగా చిత్రీకరించారు దర్శకుడు ముదస్సర్ అజీజ్.. టీ సిరిస్ అధినేత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 6న 'పతీ ఔర్ పత్నీ ఓ' విడుదల కానుంది.

Read MoreRead Less
Next Story