తమిళనాడులో బీజేపీకి భారీ షాక్‌

తమిళనాడులో బీజేపీకి భారీ షాక్‌
X

Arasakumar

తమిళనాడులో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిటి అరసకుమార్. బీజేపీకి రాజీనామా చేసి డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ సమక్షంలో డిఎంకెలో చేరారు. గురువారం ఉదయం డీఎంకే ప్రధాన కార్యాలయానికి

తన అనుచరులతో వెళ్లిన ఆయన డీఎంకే తీర్ధం పుచ్చుకున్నారు. అంతకంటే ముందు డిసెంబర్ 1 న పుదుకోట్టైలో జరిగిన వివాహ కార్యక్రమంలో అరసకుమార్ స్టాలిన్‌ను ప్రశంసించారు. పెళ్లిలో మాట్లాడుతూ, అరసకుమార్ స్టాలిన్‌ను ఎంజిఆర్‌తో సమానం చేసి, అతన్ని తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షించారు.

ఇక బీజేపీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల తరువాత తిరిగి సొంతగూటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. డీఎంకే కుటుంబ సభ్యునిగా నన్ను చేర్చుకున్నందుకు స్టాలిన్‌కు ధన్యవాదాలు. నేను స్టాలిన్‌ గురించి మాట్లాడినప్పటి నుంచి బీజేపీ కార్యకర్తలు, నాయకులు నన్ను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. కానీ నేను నిజమే మాట్లాడాను. అని అన్నారు.

Tags

Next Story