అమరావతి ప్రాజెక్టు తప్పని ప్రజలంటే.. క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం : చంద్రబాబు

అమరావతి ప్రాజెక్టు తప్పని ప్రజలంటే... క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజారాజధానిలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం లేనిపోని అపోహలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు చంద్రబాబు.
రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయామని...ఇప్పుడు రాజధాని విషయంలోనూ అన్యాయం జరిగితే మరింత తీవ్రంగా నష్టపోతామన్నారు.. ప్రజల చైతన్యం వల్లే అమరావతి నిలబడుతుందని స్పష్టం చేశారు...
అమరావతిని గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. వేల ఏళ్లు నిలిచే నగరం కోసం మంచి డిజైన్లు తయారు చేశామని చెప్పారు. రాష్ట్రానికి మంచిపేరు రావాలానే ఇదంతా చేశామన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో అభివృద్ధి మొత్తం ఆగిపోయిందన్నారు. రాజధాని ప్రాంతంలో పనిచేసే... 50 వేల మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు..
టీడీపీ హయాంలో అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టలేదన్న వైసీపీ విమర్శలతో ఇటీవలే రాజధాని ప్రాంతంలో పర్యటించారు చంద్రబాబు. ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు..ఈ భేటీకి రాజధానిరైతులు, ప్రజా సంఘాలతోపాటు పలు పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. అమరావతిపై పూర్తి వివరాలతో బుక్‌ను రిలీజ్ చేశారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com