మళ్లీ సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

మళ్లీ సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

kohili

డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి దుమ్ము రేపాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్‌లో నిలిచాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ ఉన్నాడు. గతంలో స్మిత్ ఫస్ట్ ప్లేస్‌లో, కోహ్లీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఇటీవలి కాలంలో టెస్టుల్లో కోహ్లీ విజృంభించాడు. వరుస ఇన్నింగ్స్‌లలో పరుగుల వరద పారించాడు. దాంతో మళ్లీ ఫస్ట్ ప్లేస్‌కు వచ్చాడు.

ఇక, టాప్ టెన్‌లో కోహ్లీతో పాటు మరో భారతీయ క్రికెటర్‌కు మాత్రమే చోటు లభించింది. అజింక్యా రహానే ఆరో స్థానంలో నిలిచాడు. రహానే గతంలో ఫిఫ్త్ ప్లేస్‌లో ఉండగా, ఇప్పుడు ఆరో స్థానానికి పడి పోయాడు. టెస్టుల్లో ఆశించిన స్థాయిలో పరుగులు చేయకపోవడం రహానేకు మైనస్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అనూహ్యంగా దూసుకువచ్చాడు. గతంలో టాప్ టెన్‌లో కూడా లేని వార్నర్, ఏకంగా 12 స్థానాలు మెరుగుపరుచుకొని టాప్ ఫైవ్‌లో నిలిచాడు.

Tags

Next Story