మృతదేహాలకు పూర్తయిన పంచనామా..

మృతదేహాలకు పూర్తయిన పంచనామా..

encounterలదిశ కేసులో ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు...అక్కడ పోస్ట్‌మార్టమ్ పూర్తైన తర్వాత డెడ్‌బాడీస్‌ను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అంతకుముందు..ఘటనాస్థలంలోనే పంచనామా నిర్వహించారు. క్లూస్‌టీమ్, ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో పంచనామా చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి ఆ నలుగురు నిందితుల కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చారు. మృతదేహాలను వారికి చూపించారు.

నలుగురు నిందితులకు నలుగురు ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌లు పంచనామా చేశారు. A-1 మహ్మద్ అరిఫ్ మృతదేహానికి ఫరూక్‌నగర్ తహసీల్దార్‌, A2- చెన్నకేశవులు డెడ్‌బాడీకి కొందుర్గ్ తహసీల్దార్, A3-శివ మృతదేహానికి నందిగామ తహసీల్దార్, A-4 నవీన్ డెడ్‌బాడీకి చౌదరిగూడ తహసీల్దార్‌ పంచనామా చేశారు. అటు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో క్లూస్‌ టీమ్ గన్స్ సీజ్ చేసింది...12 బుల్లెట్లను కూడా రికవరీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story