ఆడపడుచుల ఆవేదన చల్లారింది..

ఆడపడుచుల కడుపు మంట చల్లారింది.. డప్పులు వాయిస్తూ విజయవాడ కాలేజీ అమ్మాయిలు సంబరాలు చేసుకున్నారు. దిశ హత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటినుంచి అమ్మాయిల రక్తం ఉడికి పోయింది. కనిపిస్తే కనికరం చూపకుండా కాల్చిపడేయాలన్న కసితో ఉన్నారు. ఎట్టకేలకు ఎన్‌కౌంటర్ జరిగి నలుగురు నిందితులు హతమయ్యారు.
ఈ ఘటనతో మరో మృగాడు ఆ ఆలోచన చేయడానికి కూడా వణికి పోతాడని సంతోషిస్తున్నారు. అయితే దిశ ఘటన జరిగిన తరువాత పదుల సంఖ్యలో చాలాచోట్ల మరికొన్ని ఘటనలు జరిగాయని అన్నారు. మృగాడు భయపడాలంటే అలా చేసిన వాడికి ఇలాంటి శిక్షలే సరైనవని అంటున్నారు.
మానవ మృగానికి శిక్షలు పడకే వావి వరుసలను మరుస్తున్నాడు. అభం శుభం తెలియని పసి పిల్లలను.. కాటికి కాళ్లు చాపుకున్న ముసలి వాళ్లను వదలట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మగాడి కామదాహానికి ఎందరో అభాగ్యులు బలవుతున్నారని.. మున్ముందు ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ఉండాలంటే ఎన్‌కౌంటరే సరైన పరిష్కారమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com