రాముడిని, కృష్ణుడిని పూజించటం కాదు ఇప్పుడు చేయాల్సింది..

అమ్మాయిలూ.. మీ అవతారాలను మార్చండి.. ఇప్పుటివరకు మీ పూజా మందిరంలో రాముడు, కృష్ణుడు ఫోటోలు ఉంచి భక్తితో పూజించారు. కానీ ఇప్పుడు ఆ అవతారాలను ఆవహించండి.. ఎంత కాలం భరిస్తారు.. ఎన్నని భర్తిస్తారు. దేవుళ్లు కూడా అసురులను హతమార్చారు. ఆ రామాయణ మహాభారతాలనే మనం ఇప్పుడు కధలు కధలుగా చెప్పుకుంటున్నాము. దేవుళ్లను పూజించండి కానీ దెయ్యాలను హతమార్చండి.. దేవుళ్ల బాటలోనే పయనించండి. త్రేతాయుగంలో రావణుడు, ద్వాపర యుగంలో దుశ్శాసనుడు మన ఆడపడుచులను కేవలం ఎత్తుకెళ్లారు. కానీ నేటి యుగంలోని రాక్షసులు మన సీతలను, ద్రౌపదులను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి తగలబెడుతున్నారు. అలాంటప్పుడు రాముడిలా, కృష్ణుడిలా మారకుండా ఎంతకాలమని వారిని పూజిస్తుంటారని దిశ ఘటనను ప్రస్తావిస్తూ.. పోలీసులు ఎన్‌కౌంటర్ జరిపిన తీరుని ప్రశంసించారు నోబెల్ శాంత బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి. దిశ ఆత్మకు శాంతి చేకూరిందని సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com