హ్యాట్సాఫ్ సర్.. నిజమైన హీరోలు హైద్రాబాద్ పోలీసులు.. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన..

మీరు నిజంగా గ్రేట్.. ఇక ముందు కూడా ఇలాగే పని చేయాలి.. మృగాలన్నీ చచ్చిపోవాలి.. మంచి సమాజం రావాలి.. ఆడపిల్లని ఆబగా చూసే ఆ కళ్లను పీకెయ్యాలి. రెక్కలు విరిచి కుళ్లబొడవాలి.. మీ డ్యూటీ మీరు చేయండి సర్.. గుమ్మం దాటి బయటకు వెళ్తుంటే దిశ గుర్తుకు వస్తోంది. ఈ ఏడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపాం.. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతాం. పోలీసులు మనకోసం మేల్కొనే ఉంటారని సంతోషిస్తాం.. హైదరాబాద్ పోలీసులకు అభినందనల పరంపర. నిన్న మొన్నటి వరకు పోలీసులను నిందించిన మహిళా లోకం.. ఈ రోజు దిశకు సరైన న్యాయం జరిగిందని భాగ్యనగర పోలీసులను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సార్.. ఇకపై కూడా ఇలాగే ప్రతిస్పందించండి. అప్పుడు కానీ ఇలాంటి దుర్మార్గులు భయపడతారు. శిక్షలు కఠినతరం చేయండి.. కాలం చెల్లిన చట్టాలకు చెల్లు చీటీ చెప్పండి.
సమాజం మారుతోంది.. అందరి ఆలోచనలూ మారుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది. మరెందుకు సార్ పోలీస్ వ్యవస్థను మార్చరు. అందరూ ఇదే ప్రశ్న. అంతటా దిశకు న్యాయం జరిగిందని హర్షం. ఆడపడుచుల కళ్లలో ఆనందం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com