దిశ కేసులో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌.. తొలిరోజే కీలక ఆధారాలు సేకరించిన సిట్‌

దిశ కేసులో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌.. తొలిరోజే కీలక ఆధారాలు సేకరించిన సిట్‌

disha-accused

దిశ కేసులో పోలీసులు దూకుడు పెంచారు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఛార్జ్‌ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసి నిందితులకు కఠిన శిక్షలు వేయించడమే టార్గెట్‌గా పనిచేస్తున్నారు. ఏడు బృందాలు ఆధారాల సేకరణలో వున్నాయి. ఒక్కో టీమ్‌లో ఉన్నతాధికారి నుంచి కానిస్టేబుల్ వరకూ ఏడుగురు ఉంటారు. ఇక కేసులో కీలకమైన నిందితుల కస్టడీ ఎపిసోడ్‌ బాధ్యతలు డీసీపీ ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం తీసుకుంది. విచారణకు సంబంధించిన వివరాలన్నీ అత్యంత సీక్రెట్‌గా ఉంచుతూ 11వ తేదీకల్లా వీలైనంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది.

అటు, కస్టడీలో ఉన్న నిందితుల్ని రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నారు. తొలిరోజు నిందితులు ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక ఆధారాలు సేకరించింది. నిందితుల లారీలో మరోసారి తనిఖీలు చేపట్టిన క్లూస్‌ టీమ్‌.. దిశ బ్లడ్‌ శాంపిల్స్‌, తల వెంట్రుకలను స్వాధీనం చేసుకుంది. లారీ క్యాబిన్‌లో మరికొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. దిశ ఘటన జరిగిన ప్రాంతం నుంచి అరకిలోమీటర్ దూరంలో మొబైల్‌తోపాటు మరికొన్ని వస్తువుల్ని నిందితులు పాతిపెట్టినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో సాక్ష్యాల పరిశీలనకు మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే DNA, ఫోరెన్సిక్ రిపోర్ట్‌ల విశ్లేషణకు ఒక టీమ్‌ను, లీగల్ ప్రొసీడింగ్స్‌కు ఇంకో టీమ్‌ను నియమించారు. ప్రధాన సాక్ష్యులు, ప్రత్యక్ష సాక్షుల విచారణ, ఐడెంటిఫికేషన్‌ కోసం మరో టీమ్ పనిచేస్తోంది. సీసీ ఫుటేజ్ విశ్లేషణ, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ కోసం ఓ బృందం ఉంది. సీన్‌ టు సీన్‌ అనాలసిస్‌, క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం మరో టీమ్ పనిచేస్తోంది. ప్రతి దశలోనూ చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా ఛార్జ్‌షీట్ పక్కాగా ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.

దిశపై హత్యాచారం, హత్య ఘటనపై విచారణను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటు చేసింది. ఇక్కడ వాయిదాలు లేకుండా రోజువారీ విచారణ జరుగుతుంది. పోలీసులు త్వరగా ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తే నెల రోజుల్లోపే తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story