దిశ ఆత్మ శాంతించింది.. సెలబ్రిటీల హర్షం..

దిశ ఆత్మ శాంతించింది.. సెలబ్రిటీల హర్షం..

disha

మంచి పని చేశారు.. మృగాళ్లకు సరైన శిక్ష విధించారు. ఇన్ని రోజులుగా దిశ ఆత్మ ఎంతగా క్షోభించి ఉంటుందో.. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది. మరే ఆడపిల్లకు ఇలాంటి దుస్థితి రాకూడదని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు దిశ తల్లిదండ్రులు. దిశ హత్యాచార ఉదంతం దేశం మొత్తాన్ని కదిలించింది. ప్రతి ఒక్కరూ నిందితులను ఉరి తీయాలని కోరుకున్నారు. మరొకడు ఇలాంటి చేయడానికే భయపడే రోజు రావాలంటే వెంటనే శిక్ష అమలు చేయాలని ముక్తకంఠంతో నినదించారు.

సంఘటన జరిగిన ఏడురోజుల్లోనే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో హైదరాబాద్ పోలీసులను దేశం మొత్తం అభినందిస్తోంది. సామాన్య ప్రజలనుంచి సెలబ్రిటీల వరకు అందరూ దిశకు సత్వర న్యాయం జరిగినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నానీ, జీవిత రాజశేఖర్, నందమూరి కళ్యాణ్ రామ్, అక్కినేని నాగార్జున దిశకు న్యాయం జరిగిందని సంతోషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరోపక్క నిందితుల తల్లిదండ్రులు ఎన్‌కౌంటర్‌పై స్పందించలేకపోతున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Read MoreRead Less
Next Story