దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసింది అక్కడే..

దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసింది అక్కడే..

disha-encounter

ఆ రాక్షసుల పాపం పండింది. దిశను తగులబెట్టిన చోటే.. ఆ నలుగురూ హతమయ్యారు. దిశపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో.. ఆమెను ఏకంగా హత్య చేసిన దుర్మార్గులు.. అదే స్పాట్‌ దగ్గర హతమయ్యారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర దిశను తగులబెట్టిన స్పాట్‌కు.. జస్ట్ అర కిలోమీటర్ దూరంలో వారి ఎన్‌కౌంటర్‌ జరిగింది.

హైద్రాబాద్‌ శివార్లలోని తొండుపల్లి టోల్‌గేట్‌ దగ్గర.. నవంబర్‌ 27న అత్యంత కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్‌.. అనే నలుగురు నరరూప రాక్షసులు.. ఫుల్లుగా మద్యం సేవించారు. దిశను నమ్మించి.. వంచించారు. అతి కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై తమ లారీలోకి ఎక్కించారు. చావుబతుకుల మధ్య ఉన్నా... ఏ మాత్రం కనికరం చూపించలేదు. మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర ఆమె భౌతిక కాయాన్ని బ్రిడ్జి కింద పడేశారు. ఆమె బతికి ఉంటుందనే అనుమానంతో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఇప్పుడదే స్పాట్‌కు జస్ట్‌.. అర కిలోమీటర్ దూరంలో ఆ నలుగురు హతమయ్యారు. పోలీసుల తూటాలకు ప్రాణాలు కోల్పోయారు.

దిశ హత్యాచార ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఫోన్‌కాల్‌ ఆధారంగా వెంటనే ఆ నలుగురిని పట్టుకున్నారు. వాళ్లను చట్టం ముందు నిలబెట్టారు. అయితే.. దోషులుగా నిరూపించే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. దిశపై దారుణానికి ఎలా ఒడిగట్టారనే కోణంలో నిర్ధారణ చేసుకునేందుకు.. పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు.. ఆ నలుగురు రాక్షసులను చటాన్‌పల్లికి తీసుకెళ్లారు. శరీరంలోని ప్రతి కణంలో నేర మనస్తత్వం నింపుకున్న కామాంధులు.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారి వెంట పడ్డారు. పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. నిందితులు ఎదురు తిరిగారు. దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు తూటాలకు పనిచెప్పారు. నలుగురు రాక్షసులనూ ఎన్‌కౌంటర్‌ చేసేశారు.

Tags

Read MoreRead Less
Next Story