ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లిన నిత్యానంద!

X

వివాదస్పద స్వామిజీ నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలను ఈక్వెడార్ ప్రభుత్వం ఖండించింది. ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తమ ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిపింది. అతను ఈక్వెడార్ నుంచి హైతీ వెళ్లాడని స్పష్టం చేసింది. నిత్యానందకు తాము ఎలాంటి సాయం చేయలేదని వెల్లడించింది.
ఇటీవల ఈక్వెడార్ నుంచి తాను ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస పేరుపెట్టినట్టు ఇటీవల నిత్యానంద ప్రకటించారు. ఓ వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు నిత్యానంద అనుచరులు. కైలాస అనేది రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషిచేస్తోందని అందులో పేర్కొన్నారు. అయితే అవన్నీ నిరాధారమైన వార్తలని ప్రకటించింది ఈక్వెడార్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
