విజృంభించిన విరాట్.. ఒంటి చేత్తో విజయాన్ని అందించిన..

ఉప్పల్ టీ20లో విరాట్ విజృంభించాడు.. ధానధన్ బ్యాటింగ్‌తో బౌండరీలు బాదేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ 20లో పరుగుల వరద పారించాడు. కెప్టెన్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
పొట్టి ఫార్మట్‌కు పెట్టింది పేరైన కరేబియన్ ఆటగాళ్లు మొదట యథేచ్చగా బ్యాట్ ఝుళిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేశారు. హెట్‌మైర్ 56, లూయిస్ 40, పొలార్డ్ 37 రన్స్ చేసి భారత్ ముందు భారీ టార్గెట్ పెట్టారు.
భారీ లక్ష్యం ముందుండడంతో విశ్వనగరంలో విరాట్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ట్వంటీ20లో ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. విండీస్ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లి సేన మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. కెప్టెన్ కోహ్లి 50 బంతుల్లో అజేయంగా 94 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 56 పరుగులతో అదరగొట్టాడు. వీరిద్దరి సూపర్ షోతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో ఘనంగా బోణీ చేసింది
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com