ఉప ఎన్నిక ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న..

కర్ణాకట ఉప ఎన్నిక ఫలితాలు సోమవారం వెలుడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.. మధ్యాహ్నం 12 గంటలలోపే ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఈ ఫలితాల కోసం అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జేడీఎస్‌లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈ ఫలితాల్లో కనీసం 8 సీట్లలోనైనా బీజేపీ గెలవాల్సి ఉంది. లేదంటే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. అయితే సీఎం యెడ్యూరప్ప 15 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు అన్ని బీజేపీకే మెజార్టీ స్థానాలు వస్తున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్‌లకు పరాభవం తప్పదనేలా ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ ఉన్నాయి. బీజేపీ 8 నుంచి 12 వరకు, కాంగ్రెస్ 3-5, జేడీఎస్ 1-2, ఇతరులు 1 స్థానాల్లో గెలుపొందుతాయని కన్నడలో పలు సర్వే సంస్థలు స్పష్టం చేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com