ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. షియోమీ రెడ్‌మీ.. సేల్

ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. షియోమీ రెడ్‌మీ.. సేల్

shiaome

సరికొత్త ఆఫర్లతో మార్కెట్లో తన సత్తా చాటుతోంది షియోమీ రెడ్‌మీ. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది. గత వారం సేల్‌తో కొంత మంది కస్టమర్లను తన ఖాతాలో వేసుకున్న షియోమీ.. ఈ వారం మరింత మందిని టార్గెట్ చేస్తూ సూపర్ సేల్తో మార్కెట్లోకి వస్తుంది. ఇప్పటికే మొదలైన ఈ సేల్ ఈ నెల 12 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సూపర్ సేల్ ఆఫర్లు Mi.comతో పాటు ఇతర ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి కె 20 ప్రో వంటి కొన్ని ప్రముఖ మోడళ్లు తక్కువ ధరలకు ఈ సేల్‌లో ఉన్నాయి. అయితే రెడ్‌మి నోట్ 8 సిరీస్ నుండి ఇటీవల విడుదల చేసిన మోడళ్లు అమ్మకానికి లేవు. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ఇఎంఐలతో 5 శాతం తగ్గింపును పొందవచ్చు.

ఇక ధరల విషయానికి వస్తే రెడ్‌మి నోట్ 7 ప్రో 64 జీబీ స్టోరేజ్‌తో రూ.10,999కు లభిస్తుంది. రెడ్‌మి నోట్ 7 ఎస్ రూ.8,999కు, రెడ్‌మి కె 20 రూ.19,999కు లభిస్తుంది. రెడ్‌మి 20 ప్రో అయితే రూ.25,999 నుంచి ప్రారంభ ధరలు ఉన్నాయి. అన్నిటికంటే తక్కువ ధరలో రూ.4,499కే రెడ్‌మి గో లభిస్తుంది. ఇక పోకో ఎఫ్ 1 వచ్చి రూ.14,999కి మార్కెట్లో లభిస్తుంది.

Read MoreRead Less
Next Story