7 Dec 2019 11:29 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / అమెరికాలో మరోసారి...

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. నలుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. నలుగురు మృతి
X

gun-fire

అమెరికాలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఫ్లోరిడాలోని ఓ నౌకాశ్రయంలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడటంతో నలుగురు మరణించారు. మరో 8మంది గాయపడ్డారు. నౌకాశ్రయంలోని సౌదీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ట్రైనర్ ఈ కాల్పులకు తెగబడ్డట్లు అధికారులు తెలిపారు. వెంటనే తేరుకున్న పోలీసులు కాల్పులు జరుపడంతో నిందితుడు మరణించాడు. కాల్పుల సంఘటన అనంతరం ఇక్కడ పనిచేస్తున్న సౌదీ దేశస్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల క్రుట్ర ఏమైనా దాగిఉందా అనేది దర్యాప్తుచేస్తున్నట్లు ప్రకటించారు.

Next Story