యాదాద్రి భువనగిరి జిల్లాలో మానవ అస్థికల కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలో మానవ అస్థికల కలకలం

yadadri

యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుమానస్పద స్థితిలో మానవ అస్తికలు కలకలం రేపుతోంది. బొమ్మల రామారం మండల కేంద్రంలో ఉన్న ఎక్స్‌ప్లోజివ్స్‌ పరిశ్రమల పరిసరాలలో అస్థికల గూడు , ఓ చెట్టుకు వేలాడుతూ టవల్‌ , పక్కనే బనియన్‌ కలకలం రేపుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు వంద ఎకరాలలో ఏపీ ఎక్స్‌ప్లోజివ్స్, రెజిఎన్సీ పరిశ్రలు ఉన్నాయి. అయితే ఈ కంపెనీలలో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన సమీర్‌ బెహ్రా కనిపించడం లేదంటూ గతంలో రామారం పీఎస్‌లో కేసు నమోదు అయింది. అప్పటి నుంచి తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు.

తాజాగా ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో పనిచేస్తున్న కొంత మంది కార్మికులకు అనుమానాస్పద స్థితిలో ఎముకల గూడు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే అవి గతంలో తప్పిపోయిన సమీర్‌వా లేక మరెవరినైనా హత మార్చి చెట్టుకు ఉరేసి చంపారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరో వైపు కంపెనీలలో పనిచేసే కార్మికుల ప్రాణాలు పోయే వరకు కూడా యాజమాన్యాలకు తెలయడంలేదా అని విమర్శలు వినబడుతున్నాయి.. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తక్కువ జీతాలకు తీసుకువచ్చి ఎలాంటి భద్రత కల్పించకుండా పనులు చేయిస్తున్నారు. గతంలో పేలుడు సంభవించి కార్మికులు ప్రాణాలు కోల్పాయారు.

Tags

Read MoreRead Less
Next Story