దిశ కేసు నిందితుల మృతదేహాలు మరో చోటికి తరలింపు
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను మరో ప్రాంతానికి తరలించారు. ఎదిర వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి చేర్చారు. మహబూబ్‌నగర్ హాస్పిటల్‌లో సరైన వసతులు లేకపోవడంతో మృతదేహాలను తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు శనివారం మృతదేహాలను పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌పై నిజానిజాల నిర్ధారణ చేసే క్రమంలో వాళ్ల పర్యటన కొనసాగింది. అయితే.. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను భద్రపరిచారు అధికారులు. 9వ తేదీ రాత్రి 8 గంటల వరకు వాటిని భద్రపరచాల్సి ఉంది. మృతదేహాలు డీకంపోజ్ అవుతున్న నేపథ్యంలో ఎదిర దగ్గరున్న ప్రభుత్వ వైద్య కళాశాల కొత్త భవనానికి వాటిని తరలించారు.
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను మరో ప్రాంతానికి తరలించారు.ఎదిర వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి చేర్చారు. సరైన వసతులు లేకపోవడంతో మృతదేహాలను తరలించినట్లు అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను భద్రపరిచారు అధికారులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com